Saturday, October 25, 2008

Teegani Mallelu (flowering creeper)

English Version:

M: Teeganai mallelu poochina vela
M: Aagana, allanaa poojako maala!
M: Manasu tera tisina moomaatamena?
M: Mamata kalabosina maata karuvena?

F: Teeganai mallelu poochina vela
F: Aagana, allanaa poojako maala

M: Telisi teliyandhaa
M: Idhi teliyaka jarigindaa
F: Epudo jarigindhaa
F: Adhi ipude telisindhaa
M: Aasa paddaa andutundha
M: Arhataina undhaa
M: Andukunna pondhikundha
M: pottu kudirenaa
F: Premakanna pasamundhaa
F: Penchukunte doshamundhaa
F: Penchunkunte tirutundhaa
F: Panchukonte marichedhaa

F: Kalalo medilindhaa
F: Idhi kadhalo jarigindhaa
M: Merupai merisindhaa,
M: Adhi valapai kurisindhaa
F: Raasi unte tapputundhaa,
F: Tappu nidhavunaa
F: Maramante marapu masipotundhaa
M: Chesukunna punyamundhaa
M: Cherukone daari undhaa
M: Chedukone cheyi undhaa
M: Cheyi cheyi kalisenaa

F: Teeganai mallely poochina vela
F: Aagana, allanaa poojako maala
F: Manasu tera tisina moomaatamena?
F: Mamata kalabosina maata karuvena?
M: Teeganai mallelu poochina vela
M: Aagana, allanaa poojako maala

తెలుగు:
M: తీగనై మల్లెలు పూచిన వేళ
M: ఆగనా, అల్లనా పూజకో మాల
M: మనసు తెర తీసిన మోమాటమేనా?
M: మమత కలబోసిన మాట కరువేన?

F: తీగనై మల్లెలు పూచిన వేళ
F: ఆగనా, అల్లనా పూజకో మాల

M: తెలిసి తెలియందా, ఇది తెలియక జరిగిందా
F: ఎపుడో జరిగిందా, అది ఇపుడే తెలిసిందా
M: ఆశ పడ్డా అందుతుందా, అర్హతైనా ఉందా
M: అందుకున్న పొందికుందా, పొత్తు కుదిరేనా
F: ప్రేమకన్నా పాశముందా
F: పెంచుకుంటే దోషముందా
F: పెంచుంకుంటే తీరుతుందా
F: పంచుకొంటే మరిచేదా

F: కలలో మెదిలిందా, ఇది కధలో జరిగిందా
M: మెరుపై మెరిసిందా, అది వలపై కురిసిందా
F: రాసి ఉంటే తప్పుతుందా, తప్పు నీదవునా
F: మారమంటే మరపు మాసిపోతుందా
M: చేసుకున్న పుణ్యముందా
M: చేరుకొనే దారి ఉందా
M: చేదుకొనే చేయి ఉందా
M: చేయి చేయి కలిసేనా

F: తీగనై మల్లెలు పూచిన వేళ
F: ఆగనా, అల్లనా పూజకో మాల
F: మనసు తెర తీసిన మోమటమేనా?
F: మమత కలబోసిన మాట కరువేనా?
M: తీగని మల్లెలు పూచిన వేళ
M: ఆగనా, అల్లనా పూజకో మాల

Video song:


Sunday, October 19, 2008

Prema ledhani (there is no love)

English:

Prema ledhani premincharadhani,
prema ledhani premincharadhani,
sakshame neevani nannu nedu chaatani!
Oh priya! Joharulu! laa la laa la la!

Prema ledhani Premincharadhani
sakshame neevani nannu nedu chaatani
Oh priya! Joharulu! laa la laa la la!

Manusu masipothe manishe kadhani,
katikarayikaina kannirundhani,
valapu chichhu ragulukonte aripodhani,
gadiya padda manasu thatti cheppani!

Usurugappi moogavoyi neevuntivi!
Usurugappi moogavoyi neevuntivi!
Moduvari needa thodu lekuntini!
Prema ledhani! laa la laa la la!

Gurutu cheripivesi jeevinchalani,
cherapalekapothe maraninchalani,
telisi kuda cheyaleni verri vaadini!
Gunde pagilipoye varaku nannu paadani!

Mukkalalo lekkaleni roopalalo,
mukkalalo lekkaleni roopalao,
marala marala ninnu choosi rodhinchani!



తెలుగు:

ప్రేమ లేదని, ప్రేమించరాదని,
ప్రేమ లేదని, ప్రేమించరాదని,
సాక్షమే నీవని నన్ను నేడు చాటనీ!
ఓ ప్రియ! జోహారులు! లా ల లా ల ల!

ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్షమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియ! జోహారులు! లా ల లా ల ల!

మనుసు మాసిపోతే మనిషే కాదని,
కటికరాయికయినా కన్నీరుందని,
వలపు చిచ్చు రగులుకొంటే ఆరిపోదని,
గడియ పడ్డ మనసు తట్టి చెప్పనీ!

ఉసురుగప్పి మూగవోయి నీవుంటివి!
ఉసురుగప్పి మూగవోయి నీవుంటివి!
మోడువారి నీడ తోడు లేకుంటిని!
ప్రేమ లేదని! లా ల లా ల ల!

గురుతు చెరిపివేసి జీవించాలని,
చెరపలేకపోతే మరణించాలని,
తెలిసి కూడా చేయలేని వెర్రి వాడిని!
గుండె పగిలిపోయే వరకు నన్ను పాడనీ!

ముక్కలలో లెక్కలేని రూపాలలో,
ముక్కలలో లెక్కలేని రూపాలో,
మరల మరల నిన్ను చూసి రోదించనీ!

Translation:

There is no love, and
one should not love at all!
Let me declare it today!
Let me take you as proof of it!
Oh darling! well done!

You are proof of no love.
Oh darling! well done!

If heart is soiled, there is no human left!
There are stones that cry, but not you!
If love burns, then it can never be quelled!
Allow me to knock your closed heart!

You hardened, and you are living in silence!
You hardened, and you are living in silence!
I am here amputated and alone,
with no shade or company!
There is no love my darling!

I know that I have to forget you and live!
I know that I have to die otherwise!
Being a stump, I can not do either!
But will keep singing my love till I die!

Have so many memories in broken pieces!
Have so many memories in broken hearts!
Let me at least look and cry again and again!

Sunday, October 12, 2008

Endamavulu (Mirages)

English:

Kannulaku dochi chetikandhani endamavulunnay!
Soyagamundi sukhamu nochani bratukulunnayi konni!

kannulaku dochi chetikandhani endamavulunnay!
Soyagamundi sukhamu nochani bratukulunnayi konni!

Bhumi Janinchi akalikodagani phalamulannavi konni!
Bhumi Janinchi akalikodagani phalamulunnavi konni!

Manusuna nindi palukagarani talapulunnavi konni!
Talaupulunnavi konni!

Srushti chesinadhi devudaina mari naasamunela srujinche!
Palukulosaginadhi devudaina mari moogalanela srujinche!
Kanulonasagindhi devudaina mari andhulena srujinche!
veluginicchinadhi devudaina mari cheekatinela srujinche!
Penucheekatinela srujinche!

Vedasastramulu chadivinavare erugaru srushtivilasam!
vedasastramulu chadhivinavare erugaru srushtivilasam!
Alpabuddhitho gnanadaathane salupaku parihasam!
Salupaku parihasam!

bratukantha paluprasnalamayamai bratukunu janakamulaayamu!
Badulu kosamu vedhukata mani bratukutaye nyayam!

bratukantha paluprasnalamayamai bratukunu janakamulaayamu!
Badulu kosamu vedhukata mani bratukutaye nyayam!

తెలుగు:
కన్నులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్!
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నాయి కొన్ని!

కన్నులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్!
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నాయి కొన్ని!

భూమి జనించి ఆకలికోదగని ఫలములన్నవి కొన్ని!
భూమి జనించి ఆకలికోదగని ఫలములున్నవి కొన్ని!

మనుసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని!
తలుపులున్నవి కొన్ని!

సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే!
పలుకులొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే!
కనులొనసిగినది దేవుడైన మరి అంధులనేల సృజించే!
వెలుగినిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే!
పెనుచీకటినేల సృజించే!

వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం!
వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం!
అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం!
సలుపకు పరిహాసం!

బ్రతుకంతా పలుప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయము!
బదులు కోసము వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం!

బ్రతుకంతా పలుప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయము!
బదులు కోసము వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం!

Audio version:
It is available at
oldtelugsongs online.

Tuesday, October 7, 2008

Andamain jeevitham (Beautiful life)

M: Andamaina jeevithamu addala soudhamu!
M: Chinna rayi visirina chedaripovunu!
M: Okka tappu chesina mukkale migulunu!

F: Andamaina jeevithamu addala soudhamu!
F: Chinna rayi visirina chedaripovunu!
F: Okka tappu chesina mukkale migulunu!

F: Andamaina jeevithamu addala soudhamu!

M: Nippu vanti vaadavu, tappu chesinavu,
M: enta tappu chesinavu!
M: Shanikamaina avesamu, manusune champindi,
M: ninnu pasuvuga marchindi!

F: Nee padachudanam dhudukutanam, pantalaku poyindi!
F: Pacchanaina nee bratukunu, patalaniki lagindi!
F: Ninnu balipasuvuga marchindi!

F: Andamaina jeevithamu addala soudhamu!

M: Evaridhi ee neramani enchi chudadhu, lokam enchi chudadhu!
M: Edo porapatani mannichadu, ninnu mannichadu!

F: Aritaku vantide adadani seelamu!
F: Aritaku vantide adadani seelamu!
F: Mullu vacchi valina, taanu kalu jarina,
F: muppu tanake tappadu, mundu bratuke undadu!

M: Chinna rayi visirina chedaripovunu!
M: Okka tappe chesina mukkale migulunu!

F: Andamaina jeevithamu addala soudhamu!

తెలుగు:

M: అందమైన జీవితము అద్దాల సౌధము!
M: చిన్న రాయి విసిరినా చెదరిపోవును!
M: ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును!

F: అందమైన జీవితము అద్దాల సౌధము!
F: చిన్న రాయి విసిరినా చెదరిపోవును!
F: ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును!

F: అందమైన జీవితము అద్దాల సౌధము!

M: నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు,
M: ఎంత తప్పు చేసినావు!
M: శనికమైన ఆవేశము, మనుసునే చంపింది,
M: నిన్ను పశువుగా మార్చింది!

F: నీ పడచుదనం దుడుకుతనం, పంతాలకు పోయింది!
F: పచ్చనైన నీ బ్రతుకును, పాతాళానికి లాగింది!
F: నిన్ను బలిపశువుగా మార్చింది!

F: అందమైన జీవితము అద్దాల సౌధము!

M: ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదు, లోకం ఎంచి చూడదు!
M: ఏదో పొరపాటని మన్నించధు , నిన్ను మన్నించదు!

F: అరిటాకు వంటిదే ఆడదాని శీలము!
F: అరిటాకు వంటిదే ఆడదాని శీలము!
F: ముళ్ళు వచ్చి వాలిన, తానూ కాలు జారిన,
F: ముప్పు తనకే తప్పదు, ముందు బ్రతుకే ఉండదు!

M: చిన్న రాయి విసిరినా చెదరిపోవును!
M: ఒక్క తప్పే చేసినా ముక్కలే మిగులును!

F: అందమైన జీవితము అద్దాల సౌధము!

English translation:

M: Beautiful life is like a glass mansion!
M: One stone throw is enough to break it!
N: One mistake is enough to turn into pieces!

F: Beautiful life is like a glass mansion!
F: One stone throw is enough to break it!
F: One mistake is enough to turn into pieces!

F: Beautiful life is like a glass mansion!

M: Being an upright man, you did a mistake,
M: you did a costly mistake!
M: Spur of the moment killed your mind!
M: and turned you into an animal!

F: Your vitality and your negligence made you stubborn!
F: It moved your future to doom's mouth!
F: It made you a victim of fate!
F: Beautiful life is like a glass mansion!

M: Society does not look whether you made this mistake,
M: or why did this mistake!
M: Neither it does not excuse your mistake!

F: Your chastity is like a leaf!
F: Whether thorn falls on leaf, or leaf flies over thorn,
F: loss is yours, and there is no further life!

M: One stone throw is enough to break it!
M: One mistake is enough to turn into pieces!
M: Beautiful life is like a glass mansion!